1137 మంది టీచర్లను తీసివేశారు

నకిలీ డిగ్రీలు, తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాల్లో చేరిన 1137 మంది టీచర్లను బీహార్ ప్రభుత్వం తొలగించింది. నితీష్‌కుమార్ ప్రభుత్వం 2006-2011 మధ్య కాలంలో స్థిర వేతన ప్రాతిపదికన 1137 మంది ఉపాధ్యాయులను నియమించింది. ఈ టీచర్లంతా తప్పుడు ధ్రువ పత్రాలతో నియామకమయ్యారని విద్యాశాఖ మంత్రి బ్రిషన్ పటేల్ తెలిపారు. అనర్హులను నియమించడంలో పాత్ర వహించిన 147 మంది సర్పంచ్‌లు, 27 మంది పంచాయతీ సేవక్‌లపై కేసు నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశం వ్యవహారంలో ఇప్పటివరకు 35 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఆయన తెలిపారు.