మహా కూటమి 130, ఎన్డీయే కూటమి 91
Published on: Sun Nov 8, 2015 9:02AM

బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శరవేగంగా జరుగుతోంది. ఈ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పక్షాలైన మహా కూటమి, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మొదట ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగింది. ఆ తర్వాత ఉదయం 10 గంటల సమాయానికి మహా కూటమి ముందంజలోకి వచ్చేసింది. మహాకూటమి 130 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా, ఎన్డీయూ కూటమి 91 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ప్రధాన రాజకీయ పార్టీలైన జేడీయూ 57 స్థానాల్లో, ఆర్జేడీ 73 స్థానాల్లో బీజేపీ 70 స్థానాల్లో, కాంగ్రెస్ 10 స్థానాల్లో ఆధిక్యంలో వున్నాయి.


