TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ముఖ్యమంత్రి మాట వినేదిలేదు

Published on: Mon Feb 27, 2017 9:31AM

బీహార్‌ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినంత పనిచేశారు. ఇక మీదట ముఖ్యమంత్రి సహా ఎవరి నోటి మాటను అమలు చేయరాదని..కేవలం లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేస్తేనే అమలు చేయాలని నిర్ణయించారు. ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఛైర్మన్ సుధీర్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

 

ఇక మీదట ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాలైనా సరే లిఖితపూర్వకంగా జారీ చేస్తేనే అమలు చేయాలని తీర్మానించారు. ఎవరో చేసిన కుట్రలో సుధీర్ ఇరుక్కున్నారని, ఆయన్ను అరెస్ట్ చేయడం అన్యాయమని, బీహార్ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని..సీబీఐతో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. అయితే దీనిపై పోలీసుల వాదన మరోలా ఉంది. తన బంధువుల కోసమే సుధీర్ ప్రశ్నాపత్రాలను లీక్ చేశారని చెప్పారు. పేపర్ లీక్ కావడంతో నియామకాల ప్రక్రియను సీఎం నితీష్ కుమార్ రద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 36 మందిని అరెస్ట్ చేశారు.