TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరి కొద్ది సేపటిలో వెలువడనున్న బిహార్ ఎన్నికల ఫలితాలు

Published on: Sun Nov 8, 2015 7:27AM

 

నేడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి.ఉదయం 8గంటల నుండి ఓట్లు కౌంటింగ్ మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలట్ ఓట్లను లెక్కించిన తరువాత ఈ.వి.ఎం.లలో నిక్షిప్తమయిన ఓట్లను లెక్కించడం మొదలు పెడతారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 39 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో మొత్తం 14, 580 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అన్ని లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు. తాజా సమాచారం ప్రకారం ఎన్డీయే-13 జనతా పరివార్-7 ఇతరులు-1 ఆధిక్యంలో ఉంది.