TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్‌లో జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

Published on: Fri Aug 29, 2025 2:36PM

 

బీహార్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు దారుణంగా కొట్టుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార్ యాత్రలో ఓ వ్యక్తి ప్రధాని మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసన బీజేపీ ర్యాలీ చేపట్టగా దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు ఎదురుపడిన సమయంలో పార్టీ జెండాలతో పరస్పరం దాడి చేసుకున్నారు.విపక్ష నేత రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఇద్దరూ కలిసి నిర్వహించిన 'ఓటర్ అధికార యాత్ర' కార్యక్రమంలో కొందరు వ్యక్తులు.. నరేంద్ర మోదీ సహా ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కావాలనే ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఈ కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ సైతం.. మోఈ ఘటనపై స్పందించారు. ప్రధాని మోదీని క్షమించమని అడిగారు. తప్పుడు వ్యాఖ్యలను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాహుల్ తెలిపారు