TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అయ్య బాబోయ్ ఈ పిజ్జా తినడానికేనా?

Published on: Mon Jan 23, 2023 9:27AM

రికార్డుల యావతో ఏం చేస్తున్నారో.. ఎందుకు చేస్తున్నారో తెలియని ఒక పిచ్చ ఇప్పడు ట్రెండింగ్ లో ఉంది. అదిగా అలాంటి పిచ్చితోనే లాస్ఏంజిల్స్ లోని ఓ పిజ్జా హిట్ ప్రపంచంలోకే అతి పెద్ద పిజ్జా తయారు చేసింది. ఆ పిజ్జా హట్ లక్ష్యం నెరవేరింది. ప్రపంచంలోనే అతి పెద్ద పిజ్టా తయారీదారుగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది.

ఇంతకీ ఆ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న పిజ్జా విస్తీర్ణం ఏం రేంజ్ లో ఉందో తెలుసా?  అది ఏకంగా 13 వేల 99 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక దీనిని తయారు చేయడానికి 6 వేల 183 కిలోల పిండి వాడారు. అంతేనా 3990 కిలోల జున్ను వాడారు.

ఇప్పుడీ పిజ్జాయే ఫుడ్డీల హాట్ టాపిక్. అసలీ పిజ్జా తినడానికేనా అంటే నెటిజన్లు జోకులేస్తున్నారు. ఏది ఏమైనా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ పిజ్జాకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.