TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందుల జడ్పీటీసీ ఉపపోరు ముందు వైసీపీకి బిగ్ షాక్

Published on: Mon Aug 11, 2025 11:44PM

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పుపై జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం(ఆగస్టు 11) ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమంటూ స్పష్టం చేసి వైసీపీకి షాక్ ఇచ్చింది.    జడ్పీటీసీ ఉప ఎన్నికలో  ఆరు పోలింగ్ బూత్‌లు మార్చాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్‌లో కోరారు. అయితే మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నదనీ, ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందంటూ ఈసీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.  ఇరు పక్షాల వాదనలూ విన్న ఏపీ హైకోర్టు.. ప్రస్తుతం పోలింగ్ బూత్ ల మార్పు విషయంలో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. దీంతొ హైకోర్టులో వైసీపీకి చుక్కెదురైనట్లైంది.  

ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల్లో జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. మండల కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లుతోపాటు ఇతర పోలింగ్ సామాగ్రి చేరుకుందని పేర్కొన్నారు.  మంగళవారం పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని ఆరు గ్రామ పంచాయతీల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.

 మొత్తం 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  ఇక పులివెందుల జడ్పీటీసీ పరిథిలోని గ్రామాలు సమస్యాత్మకం కావడంతో.. దాదాపు 700 మందితో భద్రతా ఏర్పాట్లు చేసింది.