టీఆర్‌ఎస్‌లో చేరనున్న దానం నాగేందర్

 

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు.. ఇప్పటికే రాజీమానా లేఖని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు.. అయితే దానం నాగేందర్ త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. అసలు దానం 2015 లోనే టీఆర్‌ఎస్‌లో చేరాలని చూసారు.. కానీ అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దానంని బుజ్జగించింది.. ఈ మధ్య కాంగ్రెస్ లో తనకి అంతగా విలువ ఇవ్వట్లేదని భావించిన దానం, కాంగ్రెస్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు.. భవిష్యత్తు కార్యాచరణ గురించి దానం ఇంకా స్పష్టం చేయనప్పటికీ, ఆయన త్వరలోనే టీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో.