TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొడాలి నానికి బిగ్ షాక్ ... అనుచరులకు 41 ఎ నోటీసులు 

Published on: Fri Mar 7, 2025 12:47PM

వైకాపా నేత ,   మాజీ మంత్రి  కొడాలి నానికి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. నాని అనుచరులకు  హైకోర్టు ఆదేశాల ప్రకారం  గుడివాడ పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు . వాలెంటరీలను బలవంతంగా  రాజీనామా చేయించడంలో కొడాలి అనుచరులు  కీలక పాత్ర పోషించారు. తమపై బెదిరింపులకు పాల్పడినట్టు బాధితులు హైకోర్టు నాశ్రయించారు.  నాని ముఖ్య అనుచరులు దుక్కిపాటి శశి భూషణ్, పాలడుగు రాం ప్రసాద్, గొర్ల శ్రీనివాస్ లు నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. అప్పటి బెవరేజెస్  ఎండీ వాసుదేవరెడ్డి, జాయింట్ కలెక్టర్ మాధవిలతారెడ్డి తదితరులపై బిఎన్ఎస్ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొడాలి నాని అనుచరులపై మరో రెండు కేసులు నమోదయ్యాయి.

 కాగా తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ ఆటోనగన్ నివాసి దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదుమేరకు మాజీ బెవరేజెస్ ఎండీ వాసుదేవారెడ్డి, జాయింట్ కలెక్టర్  మాధవిలతరెడ్డి , గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని  తదితరులపై పోలీసులు  కేసులు నమోదు చేశారు.