TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుప్రీంలో నటుడు మోహన్ బాబుకు భారీ ఊరట!

Published on: Thu Jan 9, 2025 2:25PM

నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు  ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మోహన్‌బాబుపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని  ఆదేశించింది. దీంతో మోహన్ బాబుకు భారీ ఊరట లభించినట్లైంది.

అయితే ఈ కేసులో బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. తన వయస్సు   78 ఏళ్లనీ,  గుండె సంబంధిత సమస్యలతో బాధపడు తున్నాననీ, కనుక తనకు   బెయిల్ చేయాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.  

ఈ పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం  తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ మోహన్ బాబుపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెడితే.. గత నెల 10 వ తేదీన మోహన్ బాబు ఓ విలేకరిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.