జార్ఖండ్ సీఎంకు సుప్రీంలో ఊరట
Published on: Thu Aug 18, 2022 6:33AM
మనీ ల్యాండరింగ్ కేసులో జర్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కు సుప్రీంలో ఊరట లభించింది. మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తునకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
గనుల అక్రమ లీజు మంజూరు ద్వారా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2010లో ఉపాధి హమీ పథకం కింద కాంట్రాక్టుల మంజూరుపై కూడా దర్యాప్తు జరిపించాలని ఆ పిటిషన్లలో కోరారు. కాగా ఈ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలని జార్ఖండ్ సర్కార్, హేమంత్ సొరేన్ అప్పీలు చేశారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ సుధాంశు ధూళియా ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.


