Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్.. బెయిలు మంజూరు
posted on: Oct 24, 2024 12:57PM
.webp)
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిలు మంజూరు అయ్యింది. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టై గత రెండు వారాలుగా చంచల్ గూడా జైలులో ఉన్న జానీ మాస్టర్ బెయిలు మంజూరు కావడంతో శుక్రవారం (అక్టోబర్ 25) విడుదల కానున్నారు. అవకాశాల పేరుతో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గత నెల 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తనకు వచ్చిన జాతీయ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి కోరుతూ జానీ మాస్టర్ గతంలో మధ్యంతర బెయిలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో కోర్టు అందుకు సమ్మతించి మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే లైంగిక వేధింపుల కేసు నమోదైనందున జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును రద్దు చేసినట్ల అవార్డ్ కమిటీ ప్రకటించింది.
దీంతో అప్పట్లో జానీ మాస్టర్ తన మధ్యంతర బెయిలు రద్దు చేసుకుని జెయిలుకు వెళ్లారు. అనంతరం రెగ్యులర్ బెయిలు కోరుతూ అప్పీలు చేశారు. అప్పట్లో ఆ పిటిషన్ తిరస్కృతికి గురైంది. ఇప్పుడు బెయిలు లభించడంతో జానీ మాస్టర్ విడుదల కానున్నారు.



.webp)


