TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డీఎస్ కొడుకుపై నిర్భయ కేసు న్యూస్.. బిగ్ మిస్టేక్

Published on: Sat Aug 4, 2018 5:41PM

 

శాంకరీ కాలేజీలోని కొందరు విద్యార్థినిలు.. డీఎస్ కుమారుడు సంజయ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆయన మీద నిర్భయ కేసు నమోదు చేయడం తెలిసిందే.. అయితే సంజయ్ మాత్రం తనకు ఏ పాపం తెలియదని, రాజకీయ కారణాలతోనే తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు.. అయితే డీఎస్ కుమారుడిపై నిర్భయ కేసు అనే న్యూస్.. డీఎస్ మరో కుమారుడు అరవింద్ కి పెద్ద తలనొప్పిగా మారింది.. డీఎస్ కుమారుడిపై నిర్భయ కేసు అంటూ సంజయ్ ఫోటోకి బదులుగా అరవింద్ ఫోటో వేసి కొన్ని పేపర్లు, వెబ్ సైట్లు న్యూస్ పబ్లిష్ చేసాయి.. దీంతో చాలామంది ఈ కేసు అరవింద్ పై అని పొరపడుతున్నారు.. ప్రస్తుతం అరవింద్ బీజేపీలో పార్టీలో ఉన్నారు, ఇలాంటి న్యూస్ ల కారణంగా రాజకీయంగా మచ్చపడే పడే ప్రమాదం ఉంది.. ఇలా ఒకరి ఫోటోకి బదులుగా మరొకరి ఫోటో వేయడం నిజంగా బిగ్ మిస్టేక్ అనే చెప్పుకోవాలి.