హాస్పిటల్లో నక్కిన ఉగ్రవాదులు.. కశ్మీర్లో హోరాహోరీ ఫైరింగ్..
Published on: Fri Nov 5, 2021 4:09PM
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత జవాన్లను టార్గెట్గా చేసుకొని దాడులకు తెగబడ్డారు. శ్రీనగర్లో స్కిమ్స్ కాలేజ్ దగ్గర ఉన్న భద్రతాదళాలపై టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
ఆర్మీ సోల్జర్స్ తేరుకునేలోపే.. ముష్కరులు స్కిమ్స్ హాస్పిటల్లోకి చొరబడ్డారు. ఆసుపత్రిలో నక్కిన ఉగ్రమూకను పట్టుకునేందుకు భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ప్రస్తుతం సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. హాస్పిటల్లో దాక్కున్న టెర్రరిస్టులు.. వైద్యులు, సిబ్బంది, రోగులకు ఎలాంటి ప్రమాదం తలపెడతారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే, భద్రతా బలగాలు అతి జాగ్రత్తగా ఆపరేషన్ చేపడుతున్నారు.


