ఎమ్మెల్యేల ఎరకేసులో బీఆర్ఎస్ సర్కార్ కు సుప్రీంలో దక్కని ఊరట
Published on: Fri Feb 17, 2023 1:13PM
ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సర్కార్ సుప్రీం ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఆ కేసు సుప్రీంలో శుక్రవారం ( ఫిబ్రవరి 17) విచారణకు వచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
కనీసం ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకూ ఎవరినీ అరెస్టు చేయవద్దంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కూడా సుప్రీం పరిగణనలోనికి తీసుకోలేదు. సీబీఐను తాము నియంత్రించలేమని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రా లతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.


