TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆందోళన వద్దు.. తన ఆరోగ్యంపై బిగ్ బి క్లారిటీ.!

Published on: Wed Jul 22, 2026 12:04PM

బిగ్ బి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా ఆయన అభిమానుల్లో వ్యక్తమౌతున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. తన ఆరోగ్య పరిస్థితిపై అమితాబ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు.  అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స జరిగిందని నెట్టింట  జరుగుతున్న ప్రచారానికి అమితాబ్ తన క్లారిటీతో  ఫుల్ స్టాప్ పెట్టారు. 

తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని అమితాబ్ స్వయంగా చెప్పారు. అయితే అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై అందరిలో ఆందోళన వ్యక్తం కావడానికి ఆయన స్వయంగా   సోషల్ మీడియాలో ఇటీవల చేసిన పోస్టే కారణమైంది.  ఇటీవల ముగిసిన   ఫిఫా వరల్డ్ కప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఉద్దేశించి అమితాబ్  తన బ్లగ్ లో  చేసిన పోస్టులో..  ఒక విజేత జట్టు లేదా ఛాంపియన్ ప్లేయర్ మ్యాచ్‌లో తీవ్రమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, మళ్లీ మానసికంగా, శారీరకంగా పుంజుకోవడం ఎంత కష్టమో వివరిస్తూ ఆ కోలుకోవడం..  ఐసీయూలో చికిత్స, సర్జరీ వంటి వాటితో పోల్చారు.  

   ఈ పోస్టు.. పోస్ట్ నెటిజన్లలో అమితాబ్ ఆరోగ్యంపై ఆందోళనకు కారణమైంది.  దాంతో క్షణాల్లో అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట ఆందోళన వ్యక్తమైది. అలాగే.. సినీ ప్రముఖులు, అభిమానులు బిగ్‌బీ ఆరోగ్యంపై ఆరా తీయడం ప్రారంభించారు. గెట్ వెల్ సూన్ అంటూ నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో  అమితాబ్ బచ్చన్  స్పందించి క్లారిటీ ఇచ్చారు.  

Amitabh Bachchan Health Update, Amitabh Bachchan Surgery Clarification, Big B Health News