హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్
posted on: Nov 5, 2024 5:15PM
హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నుంచి (నవంబర్ 5) స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే , రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు కు వ్యతిరేకంగా ప్రయాణిస్తే కఠినచర్యలు తీసుకుంటున్నట్టు హెచ్చరించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు జరిగి 215 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో చాలామంది హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారే . హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగించనున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ (ట్రాఫిక్) పి. విశ్వప్రసాద్ తెలిపారు. తలకు గాయమైతే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.


.webp)



