ముగిసిన భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు..
Published on: Mon Mar 13, 2017 6:05PM

టీడీపీ నేత, నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు ఆయన అంతిమ సంస్కారానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కడసారి నాగిరెడ్డిని చూసేందుకు ప్రజలు.. పార్టీ నేతలు పెద్ద ఎత్తున వచ్చారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, భూమా నాగిరెడ్డి బంధువులు, అభిమానులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. కాగా నిన్న గుండెజబ్బుతో భూమా నాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.


