TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భూమా నాగిరెడ్డికి చంద్రబాబు నివాళి...

Published on: Mon Mar 13, 2017 3:47PM

 

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే  భూమా నాగిరెడ్డి నిన్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మృతికి టీడీపీ నేతలతో పాటు వివిధ పార్టీల నేతలు కూడా నివాళులు అర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకొని నాగిరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం భూమా కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని, అన్ని వేళలా తాను అండగా ఉంటానని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు.

 

ఇదిలా ఉండగా.. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో నంద్యాల ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిపోయింది. దీంతో  ఈ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ స్థానం నుండి ఎవరిని నిలబెడదామని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే అప్పుడే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నేతలతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.