TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నంద్యాల, ఆళ్లగడ్డ ఇక నావే...

Published on: Mon Mar 13, 2017 11:09AM


కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే  భూమా నాగిరెడ్డి నిన్న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మృతికి టీడీపీ నేతలు పలువురు పార్టీల నేతలు కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల గురించి భూమా నాగిరెడ్డి నిత్యమూ బాధపడుతూ ఉండేవారని, ఈ రెండు ప్రాంతాల్లో సమస్యలపై పలుమార్లు ఆయన తనతో మాట్లాడారని తెలిపారు. ఇకనుండి నంద్యాల, ఆళ్లగడ్డ రెండూ తన సొంత నియోజకవర్గాలని.. ఈ నియోజక వర్గాల్లో ఉన్న సమస్యలను వెంటనే తీర్చాలని అన్నారు. నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తిగా వెచ్చించాలని చంద్రబాబు సూచించారు.