భూమా మృతిపట్ల కేసీఆర్ సంతాపం
Published on: Sun Mar 12, 2017 2:10PM
.jpg)
నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. భూమా కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈచిన్న వయసులోనే ఆయన మరణించడం తనను కలచివేసిందని..పిల్లలు వృద్ధిలోకి రాకముందే ఈ విధంగా జరగడం చాలా బాధకరమన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


