TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆళ్లగడ్డ బయల్దేరిన చంద్రబాబు, లోకేష్

Published on: Sun Mar 12, 2017 1:21PM

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తెలుగుదేశం శ్రేణులను విషాదంలోకి నెట్టింది. వైద్యం చేయించుకుని తమ నేత నవ్వుతూ తిరిగొస్తారని ఆశించిన వారిని ఆయన మరణవార్త షాక్‌కు గురిచేసింది. అటు ఆయన ఆరోగ్య పరిస్థిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భూమా ఇకలేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. నాగిరెడ్డి మరణం తనను షాక్‌కు గురిచేసిందని..ఆయన లోటు పూడ్చలేనిదని..టీడీపీ తన కుటుంబసభ్యుడిని కోల్పోయిందని అన్నారు. ఈ కష్టసమయంలో భూమా కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చేందుకు అమరావతి నుంచి ఆళ్లగడ్డ బయలుదేరారు. భూమా మృతి చెందిన విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ బయలుదేరారు.