TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఫలించని వైద్యుల ప్రయత్నం..తుదిశ్వాస విడిచిన భూమా

Published on: Sun Mar 12, 2017 12:36PM

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇకలేరు. నేటి తెల్లవారు జామున తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను హుటాహుటీన ఆళ్లగడ్డకు..అక్కడి నుంచి నంద్యాలకు తరలించారు కుటుంబసభ్యులు. అప్పటి నుంచి ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే భూమా శరీరం స్పందించకపోవడంతో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన ఆకస్మిక మృతితో భూమా అనుచరులు, టీడీపీ కార్యకర్తలు, మద్ధతు దారులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.