హెలికాఫ్టర్‌లో భూమాను తరలించండి..అధికారులకు చంద్రబాబు ఆదేశం
Published on: Sun Mar 12, 2017 12:24PM
.jpg)
కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది. తొలుత ఆయనను ఆళ్లగడ్డకు..అనంతరం నంద్యాల ఆసుపత్రికి తరలించినప్పటికి ఫలితం లేదు. ఇటు భూమా ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసిన ఆయన మెరుగైన వైద్యం కోసం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. భూమా చికిత్సను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి కామినేనిని సీఎం ఆదేశించారు.


