TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూమా ఫ్యామిలీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరో లీడర్

Published on: Tue May 19, 2026 7:04PM

 

ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన భూమా కుటుంబం నుంచి మరో వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టున్నారు. దివంగత దంపతులు మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల చిన్న కుమార్తె మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దమవుతున్నారు. ప్రస్తుత ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అఖిలప్రియకు స్వాయానా చెల్లెలు అయిన మౌనిక పొలిటికల్ ఎంట్రీపై ఆమె భర్త, హీరో మంచు మనోజ్‌ తాజాగా సంచలన ప్రకటన చేశారు. 

తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి మనోజ్ దంపతులు ఇటీవల ఐక్య సంస్థను మొదలుపెట్టారు. ఈ నెల 20న తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్  ఐక్య సంస్థపై ఉన్న పలు సందేహాలపై  క్లారిటీ ఇచ్చారు. ఐక్య సంస్థ రాజకీయ సంస్థ కాదని, ప్రజల వైపు మాట్లాడే గొంతుకగా ఉండేందుకు ఈ సంస్థను ప్రారంభించామన్నారు. 

దాని కార్యకలాపాల కోసం సొంత నిధులను ఉపయోగించనున్నామని, తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.. మీ తండ్రితో ఉన్న గొడవలు సద్దుకున్నాయా? అన్న ప్రశ్నకు ‘అది ఎవరిని అడగాలో మీకు తెలుసు. మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా హెల్మెట్‌ పెట్టుకోండి’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అదలా ఉంటే మౌనిక ఎంట్రీ టీడీపీ నుంచే ఉంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.