భోపాల్-ఉజ్జయిని ప్యాసెంజర్ రైలులో పేలుడు..
Published on: Tue Mar 7, 2017 3:34PM

భోపాల్-ఉజ్జయిని ప్యాసెంజర్ రైలులో పేలుడు సంభవించింది. వివరాల ప్రకారం...ఈరోజు మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా కలాపీపల్ సమీపంలో భోపాల్-ఉజ్జయిని ప్యాసెంజర్ రైలులో పేలుడు చోటుచేసుకుంది. పేలుడు శబ్దం విన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే చైన్ లాగి, రైలును ఆపేసి, కిందకు దిగిపోయారు. పేలుడు వల్ల 3 బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుమంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. ఈ పేలుడు వెనుక కారణాలు గురించి దర్యాప్తు ప్రారంభించారు.


