జగన్ 'వైజాగ్ డ్రీమ్స్' ఫసక్!.. భీమ్లా నాయక్ వేదికగా 'జై హైదరాబాద్'..
Published on: Thu Feb 24, 2022 12:02PM
ఎన్నో సినిమా ఫంక్షన్స్.. ఎన్నో కలర్‌ఫుల్ టాలీవుడ్ ఈవెంట్స్.. వాటికీ భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ప్రోగ్రామ్‌కి చాలా చాలా తేడా కనిపించింది.. అది సినిమా వేదికే అయినా.. అక్కడ పరోక్షంగా రాజకీయ డైలాగ్స్ డాల్బీ సౌండ్స్‌లో మారుమోగిపోయాయి.. అది పవన్ కల్యాణ్ స్పీక్ అయినా.. కేటీఆర్ ప్రసంగం అయినా.. తలసాని స్టేట్‌మెంట్ అయినా.. హైదరాబాదే టాలీవుడ్‌కి కేరాఫ్ అడ్రస్ అని బలమైన మెసేజ్ ఇచ్చారు. ఎక్కడా ఏపీ-విశాఖ పేరుగానీ, జగన్ పేరుగానీ ఎత్తకుండా.. జగనన్నకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకి మంచి ప్రోత్సాహం ఇస్తోంది. హైదరాబాద్ అంతర్జాతీయ సినీ పరిశ్రమకు కేంద్రంగా మారింది. ముందుముందు మరింత అభివృద్ధి సాధిస్తుంది. ఇవీ భీమ్లా నాయక్ డయాస్‌పై ప్రధానంగా వినిపించిన స్టేట్‌మెంట్స్. మామూలుగా అయితే.. ఇలాంటి ఫంక్షన్స్‌లో ఆ సినిమా గురించో.. అందులోని నటులు, టెక్నీషియన్స్ గురించో స్పీచ్‌లు ఉంటాయి. కానీ, ఫస్ట్ టైమ్.. తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం.. హైదరాబాద్ టాలీవుడ్ కేంద్రం.. అంటూ గట్టిగా నొక్కి వక్కానించడం ఆసక్తికరంగా మారింది. ఇందతా.. ఏపీ సర్కారుకు, జగన్‌రెడ్డికి హెచ్చరికనే అంటున్నారు.
ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించి పరిశ్రమను తొక్కేసింది. సినీ పెద్దలతో దండాలు పెట్టించుకుని ఇండస్ట్రీని అవమానించింది. విశాఖకు రండి భూములిస్తాం.. స్థలాలిస్తాం..అన్నా ఒక్కరూ ఓకే అనలేదు. బావమరిది మంచుతో తిరుపతిలో స్టూడియో పెడతానని చెప్పించి మమ అనిపించారు. జగనన్న పిలిచారని.. భూములిస్తానని అన్నారని.. ఒక్కరూ కూడా విశాఖకు వెళ్లేందుకు ముందుకు రాకపోవడం.. జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై నమ్ముకం లేకపోవడమే అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ సర్కారు టికెట్ ధరలు భారీగా పెంచడం, ఐదో షోకు పర్మిషన్ ఇవ్వడం లాంటి చర్యలతో.. ఏపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయింది.
ఇక, టాలీవుడ్‌ను విశాఖకు రమ్మని జగన్ పిలవడం.. ఏపీ ఆదాయమే ఎక్కువంటూ పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేయడం.. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ మంత్రులు కేటీఆర్‌గానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని పదే పదే చెప్పడం.. పవన్ కల్యాణ్ సైతం 8 ఏళ్లుగా కేసీఆర్ సర్కారు ప్రోత్సాహాన్ని కొనియాడటం.. ఇదంతా.. జగన్‌కు చెక్ పెట్టడానికేనని అంటున్నారు. సినీ పరిశ్రమ ఏపీకి వెళ్లకుండా కేటీఆర్ అండ్ కో.. ఇక్కడే మీకు బాగుంటుందని స్పష్టం చేయడం.. పీకే సైతం ఇక్కడే బాగుందనేలా మెసేజ్ ఇవ్వడం.. జగన్ ప్రభుత్వానికి ఇరకాటమే అంటున్నారు. టాలీవుడ్‌ను నయానో భయానో దారికి తెచ్చుకొని.. విశాఖకు తరలించాలనే ప్రయత్నాలకు.. భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ చెక్ పెట్టేలా ఉందని విశ్లేషిస్తున్నారు.


