ప్రేమికుల రోజున బుల్లోడు రాక

posted on: Feb 3, 2014 11:16AM

 

సునీల్, ఎస్తర్ జంటగా నటించిన "భీమవరం బుల్లోడు" చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ చిత్రాన్ని అనుకోకుండా వాయిదా వేసి ప్రేమికులరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. తనకి క్యాన్సర్ ఉందని అనుకున్న వ్యక్తి మొండితనంతో సాహసాలు చేయడం, ఆ తర్వాత తనకు క్యాన్సర్ లేదని తెలిసి రెచ్చిపోవడం చాలా సరదాగా ఉంటుందని సునీల్ తెలిపాడు. 1990లో వచ్చిన "షార్ట్ టైమ్" అనే మూవీ ఆధారంగా ‘భీమవరం బుల్లోడు’ నిర్మించారు. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో డి.సురేష్ బాబు నిర్మించారు. సునీల్ కెరీర్ లో అత్యధిక కామెడిని పంచే చిత్రంగా తెరకెక్కినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అనూప్ అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...