TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడియో వేడుకలో ఒకరి మృతి

Published on: Mon Dec 23, 2013 8:57AM

 

సునీల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భీమవరం బుల్లోడు". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం భీమవరంలో జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబు నిర్మించిన ఏ చిత్రానికి ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకను భీమవరంలో జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, ఆడియో విడుదల చేసారు. అయితే ఈ వేడుకలో ఒక అపశ్రుతి దొర్లింది. సంగినీడి సురేష్ (25) అనే వ్యక్తి, ఈ వేడుకను చూడటానికి వచ్చి, ఆ తొక్కిసలాటలో గాయపడి, మృతి చెందాడు. ఫిట్స్ వచ్చి చనిపోయాడని భావిస్తున్నాం. కానీ మాకు ఇంతవరకు ఏ ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.