TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భవానీ ద్వీపం చిరువర్గం మంత్రికి ఇచ్చింది నిజమే

Published on: Fri Feb 10, 2012 3:27PM

విజయవాడ: భవానీ ద్వీపాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయించిన మాట వాస్తవమేనని మంత్రి వట్టి వసంత కుమార్ చెప్పారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ భవానీ ద్వీపాన్ని రూ.289 కోట్లకు గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీకి అప్పగించామని చెప్పారు. భవానీకి ప్రత్యూష షిప్పింగ్ కంపెనీ కోట్ చేసిందని చెప్పారు. అందుకే అప్పగించామని అన్నారు. ఈ ద్వీపానికి గంటా దాఖలు చేసే నాటికి తాను ఈ శాఖ మంత్రిగా లేనని ఆయన వివరణ ఇచ్చారు. వట్టి వసంత్ కుమార్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు మండిపడ్డారు. ఈ అంశంపై అసెంబ్లీని స్తంభింప జేస్తామని అన్నారు. భవానీ ద్వీపం ఓ వ్యక్తికి కట్టబెట్టడానికి వారెవరని అన్నారు. కాగా చిరంజీవి వర్గానికి చెందిన శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన భవానీ ద్వీపం ఐలాండ్ పర్యాటక ప్రాజెక్టును అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.