ఫోన్ డేటా చార్జీల పెంపు తప్పదు
Published on: Tue Aug 25, 2020 4:54PM
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాస్ లు, జూమ్ మీటింగ్ లు, కాపక్షేపం కోసం చాటింగ్ లు ఇలా అనేక రకాలుగా మొబైల్ డేటా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రానున్న కాలంలో చార్డీల పెంపు తప్పదు అంటున్నాయి మొబైల్ కంపెనీలు. మొన్నటి వరకు నెట్ వర్క్ వాడకం దారుల సంఖ్య పెంచడానికి ఉచితం నెట్ వేసి మరీ జియో సంస్థ ఇంటర్నెట్ సదుపాయం కల్పించింది. ఆ తర్వాత చార్జీలు పెంచింది. కరోనా కష్టకాలంలో మొబైల్ నేస్తమై ఎంతోమందికి కాలక్షేపంగా మారింది. ఇప్పుడు అదను చూసుకుని చార్టీలు పెంచడానికి టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
తాజాగా భారతి ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ రానున్న ఆరు నెలల్లో మొబైల చార్జీల ధరలు పెరుగుతాయని మెల్లగా లీకేజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ధరలకు డేటా ఇవ్వడం ఇకపై సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. మొబైల్ కమ్యూనికేషన్ కోసం కన్నా కాలక్షేపం కోసం వాడేవారి సంఖ్య పెరగడంతో డేటా వాడకం విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ధరలను పెంచినా కాలక్షేపం కోసం అలవాటు పడిన వినియోగదారులు కిక్కురుమనకుండా చెల్లిస్తారని కంపెనీ యాజమాన్యం ధీమా..! ఏం చేస్తాం అంతా కరోనా కాలం మహిమ.


