ఇండియాలో 4జీ సేవల్ని ప్రారంభించిన ఎయిర్టెల్
Published on: Tue Apr 10, 2012 3:20PM
ఇండియాలో మొట్ట మొదటి 4జీ సర్వీసుల్ని భారతీ ఎయిర్‌టెల్ సంస్థ మంగళవారం కోల్‌కతాలో ప్రారంభించింది. ఈ సేవలను కేంద్ర టెలికామ్ మంత్రి కపిల్ సిబాల్ ప్రారంభించారు. ఈసేవల ఆవిష్కరణతో 4జీ హైస్పీడ్ సర్వీస్‌ను దేశంలో తొలుత ప్రవేశపెట్టిన కంపెనీగా భారతి ఘనత సాధిస్తుంది. భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటి వరకు ఈ సేవల్ని 2జీ, 3జీ సర్వీసుల ద్వారా అందిస్తున్నారు, అయితే 4జీ రాక వల్ల ఈ సేవల్లో వేగం, నాణ్యత పెరుగుతాయి. అమెరికాలోని టెలికాం కంపెనీలు ఇప్పటికే 4జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చాయి. 4జీ సర్వీసుల ద్వారా సెకనుకు 100 మెగాబైట్ల వేగంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఫిక్స్‌డ్ లోకేషన్‌లో ఒక గిగాబైట్ సెకనుకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చున్నారు.కోల్‌కతా కాకుండా మరో మూడు (మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో) సర్కిళ్లలో వేలం పాటను తాము కైవసం చేసుకున్నట్టు కంపెనీ అధికారి వెల్లడించారు.


