TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘భారతీయ న్యాయ సంహిత’ తొలి కేసు నమోదు!

Published on: Mon Jul 1, 2024 10:45AM

ఇంతకాలం మనం వింటూ వచ్చిన ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ఇక వుండదు. దాని స్థానంలో బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) వచ్చింది. దీనితోపాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) కూడా అమలులోకి వచ్చాయి. జులై 1 నుంచి కొత్త బీఎన్ఎస్ చట్టం ప్రకారం తొలి కేసు నమోదైంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ పరిధిలోని ఒక వీధి వ్యాపారి మీద కొత్త క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఢిల్లీలోని ఒక వ్యాపారి రోడ్డు మీద వాటర్ బాటిళ్ళు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. దానివల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, దాన్ని వేరేచోటుకు తరలించమని అతనికి పోలీసులు పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పోలీసులు వీడియోగా తీసి, కేసు నమోదు చేసినట్టు ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్నారు. అదేంటో, ఏ చట్టమైనా మొదట సామాన్యుల దగ్గరే బాగా పనిచేస్తుంది.