TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విస్తరిస్తున్న ‘భారత్‌స్వాభిమాన్‌’ ట్రస్టు

Published on: Tue Jul 10, 2012 9:08AM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీనగరంలోనూ భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. ఇది యోగాగురువు రామ్‌దేవ్‌బాబా నెలకొల్పిన ట్రస్టు. ప్రత్యేకించి ఆంధ్రరాష్ట్రంలో ఈ ట్రస్టు పతాంజలి యోగాభ్యాస శిక్షణ, ఆయుర్వేద వైద్యశాల రూపంలో ఎక్కువ మందికి చేరువవుతోంది. అతితక్కువ ఖర్చుతో మందులను అమ్మటం, నలుగురిని రప్పించుకుని ఉచిత వైద్యసేవలు అందించటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదయం పూట యోగాభ్యాస శిక్షణ, అనంతరం ఆసుపత్రి , ప్రత్యేకమైన సమయాల్లో భారత్‌స్వాభిమాన్‌ ట్రస్టు పేరిట అవినీతి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు.

 

మరో పదేళ్లలోపు తమ రామ్‌దేవ్‌ బాబా మొత్తం దేశంలో మౌళికమైన మార్పు తీసుకురాగలరని ట్రస్టు సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఏ స్థాయిలోనూ ఉండటానికి వీలులేదనే తమ సిద్ధాంతమే బలమైనదని ట్రస్టు సభ్యులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని తమ ఆసుపత్రికి వచ్చే వారికి వివరిస్తున్నారు. బ్యానర్ల రూపంలో ప్రచారంలోనూ వారు చూపుతున్నారు. అతితక్కువ ఖర్చుతో ఆరోగ్యం అన్నట్లు వీరు ఉద్యోగ, మధ్యతరగతి, పేద వర్గాలకు దగ్గరవుతున్నారు. ఇటీవల పెరిగిన ఒబేసిటీ, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలతో వచ్చే వారిని ఆహ్వానించి వారికి ఉచిత వైద్యసేవల ద్వారా తమ ట్రస్టు కార్యకలాపాలను వివరిస్తున్నారు. ఏమైనా మరో పదేళ్లలోపు ఎక్కువ మంది పేదలకు ఈ ట్రస్టు చేరువయ్యే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి తూర్పుగోదావరి, అనంతపురం, కృష్ణా, గుంటూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి వంటి పలు ప్రాంతాల్లో ఈ ట్రస్టు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది.