నేతాజీ, వాజ్ పేయిలకు భారతరత్న?
Published on: Mon Aug 11, 2014 5:40AM
ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మోడీ ప్రభుత్వం దేశంలో అత్యునత పురస్కారం అయిన భారతరత్న అవార్డును నేతాజీ సుబాష్ చంద్ర బోస్ మరియు మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయిలకు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక ఏడాదిలో ముగ్గురుకి మించకుండా ఈ అత్యున్నత పురస్కారం ఈయవచ్చును గనుక ప్రముఖ క్రీడాకారుడు స్వర్గీయ ధ్యాన్ చంద్ లేదా ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు స్వర్గీయ మదన మోహన్ మాల్వీయలలో ఎవరో ఒకరికి ఈ అవార్డు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ పేరుకూడా వినిపిస్తోంది. బహుశః ఆగస్ట్ 15లోగానే మోడీ ప్రభుత్వం ఎవరెవరికి ఈ అత్యున్నత పురస్కారాలు ఈయబోతోందనే సంగతి తెలియవచ్చును.


