TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెట్రోల్ ధరలకు నిరసనగా నేడు భారత్ బంద్

Published on: Thu May 31, 2012 11:17AM

పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా గురువారం భారత్ బంద్ కొనసాగుతోంది. అన్ని జిలాల్లలో ఆర్టీసి డిపోల ఎదుట తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. చాలాచోట్ల ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ యూపీఏ మిత్రపక్షం డీఎంకే తమిళనాడులో ఆందోళన చేపట్టింది. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇందులో డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి స్వయంగా ఆందోళనలో పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని.. పెట్రోల్ ధరలు తగ్గించకుంటే యూపిఎకు మద్దతు ఉపసంహరించేందుకుకూడా వెనకాడబోమని కరుణ హెచ్చరించారు. ఇప్పటికే తృణమూల్ అధినేత్రి మమత కూడా కోల్ కతాలో నిరసన ప్రదర్శన చేశారు. అటు.. కేంద్రమంత్రి ఏకే ఆంటోనీ కూడా వీరితో జతకలవడం విశేషం. పెట్రో ధరలు సామాన్యునిపై పెను భారాన్ని మోపాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.



అటు.. ఎన్డీయే, వామపక్షాలు తలపెట్టిన భారత్ బంద్ సందర్భంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే జీతాల్లో కోత తప్పదని పశ్చిమ బెంగాల్‌లోని మమత బెనర్జీ సర్కారు హెచ్చరించింది. ఆ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు మంజూరు చేసే ప్రసక్తే లేదని, ప్రత్యేక కారణాలేవీ చూపకుండా సెలవు పెట్టినా ఒప్పుకోబోమని మమత సర్కారు సర్క్యులర్ కూడా జారీచేసింది.