TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భానుకిరణ్‌ను విచారించనున్న సీఐడీ పోలీసులు

Published on: Wed Apr 25, 2012 3:36PM

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను బుధవారం సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ నెల 25 నుంచి 9 రోజులపాటు సిఐడి కస్టడీకి కోర్టు అనుమతించిందినుంచి. వచ్చే నెల 4న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ధర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని, న్యాయవాది సమక్షంలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు షరతులు విధించింది. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తరువాత పోలీసులు భానుకిరణ్‌ని నేరుగా సీఐడీ కార్యాలయానికి తీసుకొనివచ్చారు. సూరి హత్య కేసుతో పాటు మరో 14 కేసులో అతన్ని విచారించనున్నారు.