భాను కిరణ్‌తో వైయస్ బంధువులకు లింక్
Published on: Tue May 15, 2012 12:12PM
భాను కిరణ్ కేసులో సిఐడి అధికారులు రాజశేఖర రెడ్డికి దూరపు బంధువైనా మల్లికార్జున్ రెడ్డిని సోమవారం విచారించారు. వైయస్ బంధువుగా చెప్పబడుతున్న మల్లికార్జున్ రెడ్డిది కడప జిల్లా. సిఐడి కస్టడీలో భాను వెల్లడించిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో మల్లికార్జున రెడ్డి పేరుతో రిజిస్టర్ అయిన 15ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. దీనిపై సోమవారం ఉదయం నుంచి మల్లికార్జున రెడ్డిని విచారించారు. సిటీస్క్వేర్ రియల్ ఎస్టేట్స్ యజమానులు దినేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి (జగన్ బావమరిది, మామ)తో కలిసి భాను వేసిన ఫ్రంట్‌లైన్ ప్రాజెక్టు గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ వెంచర్ కోసం రైతుల నుంచి భూమలు సేకరించి వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదని, అందులో కొంత భూమిని విక్రయించారని వచ్చిన ఫిర్యాదులపై సిఐడి దర్యాప్తు చేస్తోంది.


