TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెట్టింగ్ రాయుళ్ళ కొవ్వు కరిగించిన కోవూరు ఫలితాలు

Published on: Thu Mar 29, 2012 9:45AM

నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలో ఉన్న బెట్టింగ్ రాయుళ్ళ కొవ్వు కరిగించింది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 30 నుంచి 40 వేళ ఓట్ల మెజారిటీతో గెలుస్తారన్న ధీమాతో బెట్టింగ్ రాయుళ్ళు సుమారు రూ. 500కోట్ల మేరకు పందాలు కట్టినట్లు తెలుస్తోంది. నిజానికి ఎన్నికోట్ల రూపాయలు బెట్టింగ్ వ్యాపారం జరిగిందో ఇదమిద్దంగా తెలియనప్పటికీ బెట్టింగ్ వ్యాపారంలో ఉన్న పలువురు వేసిన లెక్కల ప్రకారం సుమారు రూ.500కోట్ల మేరకు బెట్టింగ్ రాయుళ్ళు జగన్ ను నమ్ముకుని నష్టపోయారు.

జగన్ ఒక సందర్భంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దాదాపు 60వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని గొప్పగా చెప్పారు. అయితే అంత కాకపోయినా కనీసం 30 నుంచి 40వేల ఓట్ల మెజారిటీ అయినా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి వస్తుందనే అంచనా తో బెట్టింగ్ రాయుళ్ళు కోట్లాది రూపాయల పందాలు కట్టారు. ఒక అంచనా ప్రకారం నెల్లూరుజిల్లాలో రూ. 110కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 100కోట్లు, కడపలో 100కోట్లు, గుంటూరుజిల్లాలో రూ. 80కోట్లు, కృష్ణా జిల్లాలో రూ. 70కోట్లు, చెన్నైలో రూ. 40కోట్లు, ప్రవాస భారతీయులు రూ. 40కోట్లు బెట్టింగ్ లు కట్టి నష్టపోయినట్లు తెలుస్తోంది.