బెంగళూరు టెక్కి దారుణ హత్య.. ల్యాప్‌టాప్ వైరుతో..
Published on: Thu Jan 21, 2016 4:30PM

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. వివరాల ప్రకారం కుసుమ్ సింగ్లా(31) అనే యువతి బెంగళూరులోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే ఆమెకు సుఖ్‌బీర్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచమయ్యాడు. కాగా మంగళవారం సుఖ్‌బీర్‌ని తన ఇంటికి రావాల్సిందిగా కుసుమ్ కోరగా అతను ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే ఇంటికి వెళ్లిన సుఖ్‌బీర్ కుసుమ్ సింగ్లాను రూ.50వేలు ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించింది. కనీసం రూ.5వేలు ఇవ్వాల్సిందిగా అడిగినా ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఉన్న సుఖ్‌బీర్ ల్యాప్‌టాప్ వైరుతో కుసుమ్ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా, తర్వాత ఆమె సోషల్‌మీడియా ఖాతా ద్వారా దర్యాప్తు చేసిన పోలీసులు హర్యానాలో సుఖ్‌బీర్‌ని పట్టుకున్నారు.


