TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెంగళూరు తొక్కిసలాట.. కింగ్ కోహ్లీపై ఫిర్యాదు

Published on: Sat Jun 7, 2025 12:48PM

ఆర్సీబీ విజయంతో బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు సంబంధించి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కబ్బన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. తొక్కిసలాటకు సంబంధించి ఆర్సీబీ కీలక ప్లేయర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై   హెచ్‌ఎం వెంకటేష్‌ అనే సామాజిక కార్యకర్త  ఫిర్యాదు చేశారు. కాగా కోహ్లీపై ఫిర్యాదు అందిందని ధృవీకరించిన పోలీసులు ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసులో భాగంగానే పరిగణించి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇలా ఉండగా బెంగళూరు తొక్కిసలాటకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కర్నాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంకర్, కో:ాధికారి జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. తొక్కిసలాట ఘటనలో తన పాత్ర, ప్రమేయం లేకపోయినా నైతిక బాధ్యత వహించిన రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.  ఇక పోతే  తొక్కిసలాటకు సంబంధించి కర్నాటక క్రికెట్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.