భుట్టో డెత్ మిస్టరీ క్లారిటీ.. చంపింది వారే..

 

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను ఎవరు చంపారో ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది. బెనజీర్ భుట్టోను లాడెన్ చంపించాడని ఒకరు...మాజీ డిక్టేటర్ ముషారఫ్ హత్య చేయించాడని..పలు ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు మిస్టరీగా మిగిలిపోయిన ఈ విషయంలో స్పష్టత లేదు. అయితే ఇన్నాళ్లకు బెనజీర్‌ను చంపింది ఎవరన్న విషయాన్ని ఓ పుస్తకం ప్రపంచానికి వెల్లడించింది. తాలిబాన్ నేత అబూ మన్సూర్ అసిమ్ ముఫ్తీ రాసిన ‘ఇంక్విలాబ్ మెహ్‌సూద్ సౌత్ వజీరిస్థాన్’ అనే పుస్తకంలో బెనజీర్ హత్యకు సంబంధించి ఆసక్తికర విషయాలు రాశారు. ఆమెను చంపింది తెహ్రిక్ తాలిబన్ అనే ఉగ్ర సంస్థ అని పుస్తకంలో పేర్కొన్నారు.  గతేడాది నవంబరు 30న ఈ పుస్తకాన్ని ప్రచురించగా  తాజాగా ఆదివారం దీనిని విడుదల చేశారు. తాలిబన్ నేతలు చేసిన పలు అకృత్యాలను  ఈ  పుస్తకంలో వివరించారు.

 

మాజీ ప్రధాని బెనజీర్ ను బిలాల్ అలియాస్ సయీద్, ఇక్రముల్లా అనే ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు హత్య చేసినట్టు పుస్తకంలో పేర్కొన్నారు. తొలుత బిలాల్ మాజీ ప్రధాని మెడపై కాల్చి ఆ వెంటనే తనను తాను పేల్చేసుకున్నాడు. ఇక్రముల్లా తప్పించుకున్నట్టు పుస్తకంలో వివరించారు. దీంతో ఇన్నాళ్లకు బెనజీర్ హత్యపై స్పష్టత వచ్చింది.