Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బినామీ ఆస్తుల గురించి చెబితే కోటి రూపాయలు
posted on: Jun 2, 2018 10:57AM

Benami Transactions Informants Reward Scheme, 2018 గురించి ఎప్పుడైనా విన్నారా. ఇక మీదట వినబోతున్నారు. ఈ చట్టం ద్వారా బినామీ ఆస్తుల గుట్టు చెప్పినవారికి భారీ బహుమతులు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికోసం ఏదో గాలివార్తలు చెబితే సరిపోదు. పక్కా ఆధారాలతో సహా మీకు తెలిసిన అక్రమాస్తుల గురించి ఆదాయపు పన్ను అధికారులకి సమాచారాన్ని అందించాలి. అది నిజమే అని తేలిన పక్షంలో ప్రభుత్వం మీకు కొంత బహుమతిని అందిస్తుంది. ఈ పథకానికి విదేశీయులు కూడా అర్హులు కావడం మరో విశేషం. ఇప్పటికే ఆధార్ నెంబరు ద్వారా ఎవరి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రభుత్వం సేకరిస్తోంది. తాజా చట్టం కూడా దానికి తోడవుతుందన్నమాట!






