అసెంబ్లీలో బీరు బాటిల్స్ ..!!
Published on: Sat Jul 7, 2018 5:52PM

మందు తాగి వాహనం నడుపుతుంటే పోలీసులు డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ చేస్తారు.. మరి మందు తాగి ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఏం చేయాలి?.. అసెంబ్లీ ముందు కూడా డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ నిర్వహించాలేమో.. మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఒక ఘటన చూస్తుంటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది కూడా.. ప్రస్తుతం ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. ఈ వర్షాలకు రోడ్లు, ఇల్లు, అసెంబ్లీ ఇలా అన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి.. దీంతో అసెంబ్లీ సమావేశాలు కూడా వాయిదాపడ్డాయి.. అయితే అసెంబ్లీలో డ్రైనేజీ పైప్ లైన్ బ్లాక్ కావటంతో నీళ్లు పొవట్లేదని.. సిబ్బంది శుభ్రం చేయబోయారు.. తీరా చుస్తే ఆ పైప్ లైన్లో బీరు బాటిల్స్ ఉండటం వల్ల బ్లాక్ అయిందని తెల్సి అధికారులు షాక్ అయ్యారు.. అసలు అసెంబ్లీలోకి బీర్ బాటిల్స్ ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు.. ఇప్పుడు ఈ బీర్ బాటిల్స్ మీరు తాగారంటే మీరు తాగారంటూ పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాయేమో అంటూ సోషల్ మీడియాలో ఛలోక్తులు వినిపిస్తున్నాయి.


