TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బుజ్జి కుక్క అల్లరి.. చిన్నారి అలక!

Published on: Tue May 31, 2022 4:30PM

చిన్నారుల నవ్వు ఓక అందం, వారి అలక ఒక అద్బుతం, వారి అల్లరి అపురూపం.. చిన్నారులు చిరునవ్వులు, చిరు అలకలు, చిలిపి అల్లర్ల ముచ్చట్లు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి వాటన్నిటిన ఒకే వీడియోలో గుదిగుచ్చి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడో నెటిజన్. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోలో చిన్నారని నవ్వించిన, అల్లరి చేయించిన, అలకబూనేలా చేసిన మరో ప్రాణి కూడా ఉందండోయ్. అదో బుజ్జి కుక్కపిల్ల. ఇద్దరూ కలిసి చేసిన సందడి ఇప్పడు సోషల్ మీడియాను లైకులతో షేక్ చేసేస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఓ చిన్నారి తన పెంపుడు కుక్క పిల్లతో ఆడుకుంటోంది.

ఆ ఆటలో ఆమె ఆనందం, తన్మయత్వం ప్రస్ఫులంగా కనిపిస్తున్నాయి. ఇక ఆట అయిపోయింది. చిన్నారి వెనుదిరికి వెళ్లిపోతుంటే ఆ కుక్క మాత్రం ఆమెను వదలకుండా కాళ్లకు అడ్డం పడుతూనే ఉంది. దానిని కూడా చిన్నారి ఆనందిస్తోనే నవ్వుకుంటూ పరుగెడుతుంది. చిన్నారి చేతిలో ఓ లాలీపాప్ ఉంది. దానిని జాగ్రత్తగా పట్టుకుని పరుగు పెడుతోంది. కుక్క పిల్ల మాత్రం అదును చూసి లటుక్కున ఆ లాలీపాప్ ను నోట కరచుకుని తుర్రు మంది.

పాపం ఆ చిన్నారి ఒక్క సారి షాక్ తింది. వెంటనే అలకబూనింది. ఏడుపు తన్నుకొచ్చింది. కుక్క పిల్ల మాత్రం తోకూపుకుంటూ పరుగు పెడుతోంది. నవ్వు, ఆనందం, అలక, ఏడుపు ఇలా చిన్నారి హావభావాలన్నిటినీ చూసి నెటిజన్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు.  చిన్నారి లాలీపాప్ పోగొట్టుకున్నందుకు ఆమెపై జాలి పడుతూనే.. ఆ కుక్క పిల్ల కొంటెతనాన్నీ ఇష్టపడుతున్నారు.