TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్టీఆర్ చేతిరాత చూస్తే అబ్బుర‌ప‌డాల్సిందే!!

Published on: Fri Feb 18, 2022 11:58AM

తెలుగుజాతికి వన్నె తెచ్చిన అగ్రగణ్యుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఒకరు. ఆ మహానటుడు శతజయంతి ఉత్సవాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. అయితే ఆ మహానటుడి ప్రతిభ పాటవాలు.. వెండి తెరపై అంతా చూశారు.. చూస్తున్నారు.. కానీ.. ఆయన చేతిరాతను చూసింది మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే.   కాగితం మీద ముత్యాలు పేర్చినట్లుగా ఉన్న ఆయన చేతిరాత ఉత్తరం.. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఉత్తరంలో ఎక్క‌డా త‌ప్పుల్లేని వాక్యాలు, ఓ ర‌చ‌యిత రాసిన‌ట్టుగా రాసిన‌ వ్యాఖ్యానాలు, వివ‌ర‌ణ‌లు ఉన్నాయి. విజ‌య‌చిత్ర అనే ప‌త్రిక ద్వారా నాటి పాఠ‌కుల‌ కోసం ఎన్టీఆర్ ఈ లేఖ రాసినట్లు సమాచారం. ఈ మూడు పేజీల లేఖ షూటింగ్ విరామ సమయంలో రాసిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఉత్తరంలో ఎన్టీఆర్ సంతకం గొలుసు కట్టు రాతతో చాలా చూడముచ్చటగా ఉంది.

ఎన్టీఆర్‌కు తెలుగు భాషపై మంచి పట్టు ఉందన్న సంగతి అందిరికీ తెలిసిందే. ఆయన చదువులోనే కాదు.. చిత్రలేఖనంలో కూడా ముందు ఉండే వారు. నాటి మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆయన 7వ ర్యాంక్ సాధించి.. మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్‌గా కొలువు చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. తన నట విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించారు.