Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్యూటీషియన్ శిరీష మృతిపై ఫోరెన్సిక్ నివేదిక...షాకింగ్ నిజాలు...
posted on: Jun 15, 2017 5:52PM

హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ శిరీష మరణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆమెది హత్యా..? లేక ఆత్మహత్యా..? అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే శిరీష ఆత్మహత్యకు.. ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు మధ్య సంబంధాలు ఉన్నాయి అని ఎప్పుడైతే వార్తలు వెలువడ్డాయో ఈ కేసు మరింత ఇంట్రస్టింగ్ మారింది. పోలీసులు వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ నేపథ్యంలోనే బ్యూటీషియన్ శిరీష మరణానికి సంబంధించిన పలు సంచలన విషయాలు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యాయి. మెడపై బలమైన ఒత్తిడి పడటం వల్లే ఆమె చనిపోయిందని.. ఆమె పెదవి, చెంపలు, తలపై గాయాలున్నాయని ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. ఆమె హిప్ భాగంలో కూడా బలమైన గాయమున్నట్టు వెల్లడైంది. దీంతో శిరీషది ఆత్మహత్య అయితే... ఆమె ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.


.jpg)



