5 రూపాయలు అడిగిందని కూతురినే కొట్టి చంపాడు!
Published on: Fri Feb 5, 2021 1:11PM
మానవత్వం మంట కలుస్తోంది. పిల్లలపై తల్లి దండ్రుల తీరు మారుతుంది. కన్నపిల్లలపైనే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. యమ కింకరులుగా మారుతూ ప్రాణాలు తీస్తున్నారు. ఐదు రూపాలయ కోసం కన్న కూతుర్ని చంపాడు ఓ కసాయి తండ్రి. స్వీటు కొనుకునేందుకు ఐదు రూపాయలు అడిగిందని... కన్న కూతురును ఇంటి మెట్లకేటి కొట్టి చంపాడు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఈ కసాయి తండ్రి భాగోతం వెలుగుచూసింది
గోండియా జిల్లా లోనారా గ్రామానికి చెందిన వివేక్, వర్షా దంపతులకు 20నెలల వైష్ణవి అనే కూతురుంది. తల్లి వర్షా చెబుతున్న వివరాల ప్రకారం.. తనకు స్వీటు ఇప్పించమని తల్లిని అడిగింది వైష్ణవి. కూతురు ఏడుస్తుండటంతో భర్తను ఐదు రూపాయలు ఇవ్వాలని అడిగింది తల్లివర్షా. దీంతో ఆగ్రహానికి గురైన వివేక్ కసాయిగా మారాడు. తన కూతుర్ని , భార్యను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. భార్యను ఇంటి తలుపుకేసి బాదాడు. దీంతో భయంతో బయటికి పరుగులు తీసింది. ఏడుస్తున్న బిడ్డను ఇంటి మెట్ల మీద కొట్టాడు. దీంతో తీవ్రగాయాల పాలైంది వైష్ణవి. ఆమెను టిరోడా ఉప జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలిక మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో భార్య వర్షా .. భర్త వివేక్ పై టిరోడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కసాయి భర్త వివేక్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


