TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘హస్తం’ వదిలేస్తామంటున్న బిసీలు?

Published on: Thu Jul 19, 2012 8:47AM

అసలే 2012 ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను మింగలేక, కక్కలేక కాంగ్రెస్‌ పార్టీ సతమతమవుతుంటే బిసీలు చేసిన హెచ్చరిక ఆ పార్టీని కుదిపేస్తోంది. అసలు తెలుగుదేశం పార్టీ పూర్తి వైఫల్యానికి బిసీలను వదిలేయటమే కారణమని తేలటంతో ఆ పార్టీ తాయిలాలు ప్రకటించింది. వందకు పైగా సీట్లు ఇవ్వటానికీ, బిసీలకు ప్రత్యేక నిధులు ఇవ్వటానికీ టిడిపి అథినేత చంద్రబాబు సిద్ధమని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఉత్సాహం చెందిన బిసీ సంఘాలు చంద్రబాబును సన్మానించాయి. ఆయన్ని చూసి మీరూ నేర్చుకోండన్నట్లు బిసీలు మిగతాపార్టీలపై దృష్టి సారించటం మొదలుపెట్టారు. అథికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంటుల్లో కోత విధించటం, రిజర్వేషన్ల ప్రక్రియను సరిగ్గా పట్టించుకోకపోవటం వంటి అంశాలు బిసి సంఘాలను కలిచి వేశాయి. దీంతో రాజులే మట్టికొట్టుకుపోయారు...కాంగ్రెస్‌ పార్టీ ఎంత అన్నట్లు బిసి ఐక్యపోరాట సమితి రాష్ట్ర నాయకుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు.

 

బిసీలకు అన్యాయం చేస్తే సిఎం, పిఎం ఎవరినైనా వదలబోమని ఆయన హెచ్చరించారు. అసలు ప్రభుత్వవైఖరిపై బిసీ మంత్రులెందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తిరుగుబాటు చేయాలన్నారు. అలానే ఎంబిబిఎస్‌ రిజర్వేషనులో బి కేటగిరి కింద చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం సిఎం కనుక బిసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీకి అందరూ దూరమవుతారని హెచ్చరించారు.