TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముందుకు సముద్రం..చెన్నైకు థేన్ తుఫాన్

Published on: Wed Dec 28, 2011 8:27AM

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన థేన్ తుఫాన్, చెన్నై తీరానికి 600 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సాయంత్రానికి వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని, తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.